EC (Encumbrance Certificate) అంటే ఏమిటి? | Meaning, Uses, Search, Download, Property Verification & Complete Guide in Telugu

EC (Encumbrance Certificate)

ఆస్థి ధ్రువీకరణ పత్రం 

EC (Encumbrance Certificate) Sample Document in Telugu showing property registration details, survey number, owner details and encumbrance records for educational purpose.

📄 Figure 1: Sample EC (Encumbrance Certificate) – ఇది విద్యాపరమైన అవగాహన కోసం మాత్రమే. ఈ చిత్రంలో వ్యక్తిగత వివరాలు గోప్యత కోసం బ్లర్ చేయబడ్డాయి.

EC (Encumbrance Certificate) అంటే ఏమిటి?

EC (Encumbrance Certificate) అంటే ఒక భూమి లేదా ప్లాట్‌పై గతంలో జరిగిన రిజిస్టర్ అయిన అన్ని లావాదేవీల అధికారిక రికార్డు.

తెలుగులో దీనిని భారం లేని ధృవీకరణ పత్రం లేదా ఆస్థి ధ్రువీకరణ పత్రం అని కూడా అంటారు.

దీనిని మన రాష్ట్రంలోని Registration & Stamps Department జారీ చేస్తుంది. ఇందులో అమ్మకం, గిఫ్ట్, మార్ట్గేజ్ (బ్యాంక్ లోన్), రిలీజ్ డీడ్ వంటి నమోదైన లావాదేవీలు కనిపిస్తాయి. 

EC ఎందుకు అవసరం?

ఒక ప్లాట్ కొనుగోలు చేసే ముందు ఇది తప్పనిసరిగా చెక్ చేయాలి.EC ద్వారా తెలుసుకోవచ్చు:

✅ ఈ భూమిని గతంలో ఎవరు కొనుగోలు చేశారు

✅ ఎన్ని సార్లు అమ్మబడింది

✅ బ్యాంక్ లోన్ ఉందా?

✅ Mortgage చేశారా?

✅ Gift Deed జరిగిందా?

✅ Release Deed ఉందా?

✅ Registered transactions ఏవైనా ఉన్నాయా? అనే విషయాలు క్లుప్తంగా తెలుసుకోవొచ్చు.

ECలో Nature of Document (Document Type) అనే కాలమ్ ఉంటుంది. 

అదే ఆ ప్రాపర్టీ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎలా బదిలీ అయింది అనేది చెబుతుంది.

ఇక్కడ ముఖ్యమైన Document Types ఇవి:

✅ Document Type

✅ తెలుగు అర్థం

ఎప్పుడు ఉపయోగిస్తారు?

1️⃣ Mortgage Deed         (తనఖా డీడ్)

Meaning: ఆస్తిని బ్యాంక్ లేదా వ్యక్తి దగ్గర తనఖా పెట్టి లోన్ తీసుకోవడం.

MR = Mortgagor

➡️ తన ఆస్తిని తనఖా పెట్టే వ్యక్తి.

Example: రాము తన ప్లాట్ మీద ₹20 లక్షల లోన్ తీసుకున్నాడు.

👉 MR = రాము

ME = Mortgagee

➡️ లోన్ ఇచ్చే వ్యక్తి లేదా బ్యాంక్.

👉 ME = SBI Bank

Shortcut గుర్తుంచుకో

MR = Money Receives (లోన్ తీసుకునేవాడు)

ME = Money Gives (లోన్ ఇచ్చేవాడు)

2️⃣ Release Deed

లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంక్ తన హక్కును వదులుతుంది.

RR = Releasor

హక్కు వదిలే వ్యక్తి.

ఉదాహరణకు:

SBI Bank హక్కు వదిలింది.

RR = SBI Bank

RE = Releasee

హక్కు తిరిగి పొందే వ్యక్తి.

RE = రాము

3️⃣ Sale Deed

ఇది చాలా Important.

EX = Executant

డాక్యుమెంట్ Execute (సంతకం చేసి అమ్మే) చేసే వ్యక్తి.

సాధారణంగా Seller.

CL = Claimant

ఆ హక్కును పొందే వ్యక్తి.

సాధారణంగా Buyer.

4️⃣ GPA (General Power of Attorney)

PL = Principal

Power ఇచ్చే వ్యక్తి.

ఉదాహరణ

రాము అమెరికాలో ఉన్నాడు.

తన అన్నకు అమ్మే హక్కు ఇచ్చాడు.

PL = రాము

AY = Attorney

Power తీసుకున్న వ్యక్తి.

AY = రాము అన్న.

5️⃣ Gift Deed

DR = Donor

Gift ఇచ్చే వ్యక్తి.

తండ్రి కొడుకుకి ఇల్లు ఇచ్చాడు.

DR = తండ్రి

DE = Donee

Gift తీసుకునే వ్యక్తి.

DE = కొడుకు

6️⃣ Lease Deed

LR = Lessor

లీజ్ ఇచ్చే వ్యక్తి.

House Owner

LE = Lessee

లీజ్ తీసుకునే వ్యక్తి.

Tenant

7️⃣ Execution Date (E)

డాక్యుమెంట్ మీద ఇద్దరూ సంతకం చేసిన తేదీ.

8️⃣ Presentation Date (P)

డాక్యుమెంట్ Sub Registrar Office లో సమర్పించిన తేదీ.

9️⃣ Registration Date (R)

రిజిస్ట్రేషన్ పూర్తైన తేదీ.

ఈ మూడు తేదీలు చాలా Important

ఉదాహరణ

Execution Date

01-05-2026

Presentation Date

03-05-2026

Registration Date

05-05-2026

ఇలా మూడు తేదీలు వేరువేరుగా ఉండొచ్చు.

🔟 Market Value

ప్రభుత్వం నిర్ణయించిన ఆస్తి విలువ.

దీనిపైనే Stamp Duty లెక్క వేస్తారు.

11️⃣ Construction Value

ఇల్లు లేదా Building విలువ.

ఖాళీ ప్లాట్ అయితే చాలాసార్లు ఇది ఉండదు.

12️⃣ EP (Execution Proceedings)

ఏదైనా అధికారి జారీ చేసిన అమలు ప్రక్రియలు లేదా అధికారిక ఆదేశాలకు సంబంధించిన నమోదు. ఇది ప్రతి డాక్యుమెంట్‌లో ఉండదు; ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది.

13️⃣ DDP (Detailed Development Plan)

ఒక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ప్రభుత్వ ప్రణాళిక.

ఎక్కడ Road

ఎక్కడ Park

ఎక్కడ Commercial Zone

ఎక్కడ Residential Zone

అన్నీ ఇందులో ఉంటాయి.

14️⃣ DTCP

Department of Town and Country Planning

లేఅవుట్లు, ప్లానింగ్, అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ శాఖ.

🎯 Real Estate Expert Shortcut

Document

ఇచ్చేవాడు

తీసుకునేవాడు


Sale Deed

Executant

Claimant


Gift Deed

Donor

Donee


Mortgage

Mortgagor

Mortgagee


Release

Releasor

Releasee


✅ GPA

Principal

Attorney


✅ Lease

Lessor

Lessee


EC వల్ల ఉపయోగాలు

1. Property History తెలుస్తుంది

ఆ స్థలం ఎవరెవరి చేతుల్లోకి వెళ్లిందో తెలుస్తుంది.

2. Loan ఉందో లేదో తెలుస్తుంది

బ్యాంక్‌కు Mortgage చేసినట్లయితే చాలా సందర్భాల్లో ECలో కనిపిస్తుంది. 

3. Registration ముందు Verification

కొనుగోలుదారుడికి నమ్మకం పెరుగుతుంది.

4. Bank Loan కోసం

చాలా బ్యాంకులు EC అడుగుతాయి.

5. Legal Verification

లాయర్లు Title Verification సమయంలో EC తప్పనిసరిగా పరిశీలిస్తారు. 

EC ఎక్కడ దొరుకుతుంది?

ఆంధ్రప్రదేశ్ (AP)

✅ Sub Registrar Office (SRO)

✅ MeeSeva

✅ AP Registration & Stamps Department Online పోర్టల్


తెలంగాణ (TS)

✅ Sub Registrar Office (SRO)

✅ MeeSeva

✅ Telangana Registration & Stamps Department Online Portal

✅ Dharani Portal (వ్యవసాయ భూములకు సంబంధించిన భూ రికార్డుల కోసం )

ECలో ఉండే వివరాలు

Document Number

Registration Date

Seller పేరు

Buyer పేరు

Survey Number

Plot Number

Village

Mandal

Nature of Document

Market Value

Transaction Details

Nil EC అంటే ఏమిటి?

ఒక నిర్దిష్ట కాలంలో ఎలాంటి రిజిస్టర్ అయిన లావాదేవీలు లేకపోతే Nil EC జారీ చేస్తారు.

అయితే Nil EC ఉందని మాత్రమే ఆస్తి పూర్తిగా సురక్షితమని అనుకోకూడదు, ఎందుకంటే రిజిస్టర్ కాని ఒప్పందాలు లేదా ఇతర హక్కులు ECలో కనిపించకపోవచ్చు. 

ECకి సంబంధించిన ముఖ్యమైన Rules

✔ ECలో రిజిస్టర్ అయిన లావాదేవీలు మాత్రమే కనిపిస్తాయి.

❌ Unregistered Agreements కనిపించవు.

❌ కుటుంబ సభ్యుల మధ్య రిజిస్టర్ కాని ఒప్పందాలు కనిపించవు.

❌ అన్ని కోర్టు కేసులు తప్పనిసరిగా ECలో ఉండవు.

అందుకే EC ఒక్కటే సరిపోదు; Title Deed, Mother Deed, Link Documents, Layout Approval వంటి పత్రాలు కూడా పరిశీలించాలి.

Property కొనేముందు EC ఎన్ని సంవత్సరాలది తీసుకోవాలి?

సాధారణంగా:

కనీసం 15 సంవత్సరాలు.ఇంకా మంచిదంటే 30 సంవత్సరాల EC తీసుకుని పరిశీలించడం ఉత్తమం. 

ముఖ్యమైన విషయం

EC చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయినా, అది ఒక్కటే సరిపోదు. ఆస్తిపై పూర్తి న్యాయపరమైన స్పష్టత కోసం ఇతర పత్రాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి. 

EC (Encumbrance Certificate)(1)

➡️ Next Topic : Sale Deed అంటే ఏమిటి?(2)

EC అంటే ఏమిటి,Encumbrance Certificate,EC Certificate,EC ఎలా చెక్ చేయాలి,EC Online,EC Telugu,Property Documents,Land Documents,Real Estate Telugu,Land Verification,Property Verification,Plot Documents,Land Registration,EC అంటే ఏమిటి తెలుగులో,Encumbrance Certificate అంటే ఏమిటి,EC ఎలా తీసుకోవాలి,EC ఎలా చెక్ చేయాలి,EC ఎందుకు అవసరం,భూమి కొనేముందు EC ఎలా చెక్ చేయాలి,ప్లాట్ కొనేముందు EC ఎలా చూడాలి,EC లో ఏమి ఉంటుంది,EC లో ఏమి చూడాలి,Property EC Verification,Real Estate Guide,Real Estate Master Course,Tirupati Best Properties,